Monday, February 24, 2014

క్రిస్టియన్ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో!


టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు క్రిస్టియన్ గా మారాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఆరడుగుల ఆజానుబాహుడైన ఈ హీరో ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్ లో తలమునకలై వున్నాడు. అయితే ఈ హీరో ఇలా మతం మారడం వెనుక పర్శనల్ లైఫ్ లో వచ్చిన డిదుడుకులే కారణమని తెలుస్తోంది. ఆ హీరో సన్నితులు మాత్రం ఈ విషయం పై పెదవి విప్పడానికి ఇష్టపడటం లేదు. మతానికీ కళలకూ ఏమాత్రం సంభంధం లేకున్నా గాని ఆ హీరోకి వచ్చిన ఒడిదుడుకుల ఏమై ఉంటాయా అని ఆరా తీస్తున్నారు ఫిల్మ్ నగర్ జనం. 

Sunday, February 23, 2014

యాంకర్ సుమ నోటి దురుసు!


ప్రస్తుతం బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న సుమ మాటల మరాఠీ అన్న సంగతి తెలిసిందే. అయితే తెరపై మాత్రం చాలా వరకూ ఆమె నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడుతుంది. అయినా ఒక్కోసారి ఆమె ఇచ్చే పంచ్ లకు ఎదుటివారి దగ్గర జవాబు కూడా వుండదు. ఇదంతా చెప్పడానికి కారణం మొన్నీ మధ్యన జరిగిన ఒక సంఘటనే. 

ఇటీవల జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ లో కొత్త హిందీ హీరోయిన్ ని స్టేజ్ మీదకి ఆహ్వానించే క్రమంలో తనదైన శైలిలో పంచ్ లను విసిరింది. వీటికి ఆ సదరు హీరోయిన్ మాత్రం సిగ్గుని నటించింది. అయినా సుమ వదలకుండా మీ హిందీ వాళ్లకి సిగ్గు కూడా పడతారా అంటూ మాట్లాడటం ఆ హీరోయిన్ కి కోపం తెప్పించింది. 
ఆ తరువాత మేకప్ రూమ్ లో హీరోయిన్ సుమను 'మైండ్ యువర్ టంగ్' అని హెచ్చరించడంతో సుమ కోపంతో ఆమెను నానా మాటలూ అన్నదని సమాచారం. ఈ తిట్ల భాగోతమంతా అక్కడే వున్న మేకప్ మెన్ ద్వారా బయటకు పొక్కింది.  

Wednesday, February 12, 2014

తీరు మారని గుణ శేఖర్...


ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగిన దర్శకుడు గుణ శేఖర్ గురుంచి తెలిసిందే. అవసరం వున్నా లేకపోయినా భారీ సెట్ లు, గ్రాఫిక్స్ వాడి నిర్మాత డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టించడంలో గుణ శేఖర్ సిద్దహస్తుడు. ప్రస్తుతం అనుష్క తో రుద్రమదేవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ధరించే నగలను ఒరిజినల్ బంగారంతో రూపొందిస్తున్నారట. 

తన సినిమాలలో భారీ సెట్ లు వేసి అందులో కమీషన్ వసూలు చేసే వాడన్న పేరు టాలీవుడ్ లో రావడంతో గుణశేఖర్ తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ముందుకు రావడం మానేశారు. ఇప్పుడు ఈ దర్శకుడి చూపు బంగారం పై పడినట్లుంది. ఈ సినిమా అయినా హిట్ అయితే గుణశేఖర్ మళ్ళీ స్టార్ దర్శకుడిగా మారే అవకాశం వుంది. 

Thursday, February 6, 2014

కమల్ కూతురితో అఖిల్


టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తనయుడైన అఖిల్ సినీ రంగ ప్రవేశం గురుంచి అనేక గాసిప్స్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. అయితే తెర వెనుక మాత్రం అఖిల్ రంగ ప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు కధలను కూడా ఎంపిక చేసారట. దర్శకుడు ఎవరనేది కూడా ఫైనలైజ్ అయిపోయిన ఈ ప్రాజెక్ట్ లో కమల్ హసన్ రెండో కూతురు అక్షరను హీరోయిన్ గా అనుకుంటున్నారని సమాచారం. ఈ ఆఫర్ కి కమల్ కుటుంబం ఒప్పుకుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.