Saturday, December 6, 2014

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ దుర్మరణం---ఫ్లాష్ న్యూస్


నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మరణించారు. ఈయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఒక ట్రాక్టర్ ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 

Friday, December 5, 2014

బాలకృష్ణ వీర 'మాస్'


నందమూరి బాలకృష్ణ నూతన దర్శకుడు సత్యదేవ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ఫొటో విడుదలయ్యింది. గళ్ళ లుంగీ దానికి తగ్గ షర్ట్  వేసుకుని వున్న ఈ చిత్రం బాలయ్యది పక్కా మాస్ క్యారెక్టర్ అని తెలియచెప్పే విధంగా వుంది. అయితే లుక్ ఇంత మాస్ గా వున్నా బాలయ్య మాత్రం ఈ సినిమాలో పవర్ ఫుల్ సీబిఐ అధికారిగా నటిస్తున్నాడట. 
బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే లు అలరించనున్నారు. ప్రస్తుతానికి అరవై శాతం వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2015 ఫిబ్రవరిలో విడుదల కానుంది. 

రేణు దేశాయ్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడం జరిగింది. ఆ వీడియో మీ కోసం..