Wednesday, February 27, 2013

సునీల్ కాన్ఫిడెన్స్?


కమెడియన్ నుంచి హీరోగా ఆరంగ్రేటం చేసిన తరువాత సునీల్ సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో అప్ కమింగ్ మూవీ అయిన 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా పబ్లిసిటీ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు సునీల్. దీనికి కారణం ఏమిటంటే... సునీల్ ఈ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. సినిమాలో విషయం వుంటే అనవసరపు పబ్లిసిటీ అవసరం లేదన్నది సునీల్ ఆలోచనగా తెలుస్తుంది. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్ సరసన ఈ సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది.  

More News: గ్రీకు వీరుడు మూవీ ట్రైలర్  

Tuesday, February 26, 2013

దర్శకురాలు నందిని రెడ్డి పై కేసు!?


సినీ ఇండస్ట్రీలో కాపీ కొట్టడం అనేది చాలా కామన్ అనే విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాల నుంచి బాలీవుడ్ కాపీ కొట్టినా, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కాపీ కొట్టినా దానిని ముద్దుగా ఇన్స్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద దర్శకులు, స్టార్లతో తీసేటప్పుడు మాత్రమే ఇటువంటి సినిమా రీమేక్ హక్కులు కొంటుంటారు. సిద్దార్ధ్, సమంతా జంటగా నటించిన 'జబర్ దస్త్' సినిమా బాలీవుడ్ హిట్ మూవీ 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాకి ఫ్రీ మేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తెలుగులో నాని హీరోగా నిర్మిద్దామనే ప్రయత్నాల్లో వుండగా నందిని రెడ్డి తెరకెక్కించేసింది. దీంతో సదరు సంస్థ నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకురాలు నందిని రెడ్డి పైనా లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. జబర్ దస్త్ సినిమా బాలీవుడ్ సినిమాకి కాపీ అని ప్రేక్షకులందరూ అంటున్నా నందిని మాత్రం ఆ సినిమాకీ, మా సినిమాకీ చాలా తేడాలున్నాయని బుకాయించే ప్రయత్నం చేస్తుంది. 'అలా మొదలైంది' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన నందిని రెండో సినిమాకే ఇలా కాపీ బాట పట్టడం విచారించదగ్గ విషయం. 

Saturday, February 23, 2013

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై వర్మ సెటైర్లు



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఏమి చేసినా సంచలనంగానే వుండేది. వర్మకి ప్రస్తుతం అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోయినా ఎంతోకొంత మిగిలేఉన్నదన్న సంగతి తెలిసిందే. మొన్న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తరువాత రాజకీయనాయకులు చేసిన ప్రకటనలపై వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. 
ఈ బాంబు పేలుళ్ళ ఘటనను ఖండిస్తున్నా అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై... ఈ అరిగిన డైలాగుని 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ వింటున్నా అని ట్వీటాడు. ప్రధాన మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చెయ్యడంపై... విచారం వ్యక్తం చెయ్యకుండా సంతోషం వ్యక్తం చేస్తారని మనం అనుకుంటామా? రాజకీయనాయకులకి కోన వెంకట్ లాంటి మంచి రైటర్స్ అవసరం ఎంతైనా వుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. 
కేంద్ర హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ పేలుళ్లపై విచారణ జరిపిస్తామని అంటే ... ఈ డైలాగు ఈ దశాబ్దానికే హైలెట్ డైలాగని సెటైర్లు వేసాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి వర్మ ఈ ఘటనను కూడా సంచలనం చెయ్యాలని చూడకుండా, సామాన్య ప్రజల ఆవేదనని తన ట్వీట్స్ ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.  

More News:

నిమిషానికి అయిదు లక్షలు తీసుకున్న అంజలి 

Thursday, February 21, 2013

హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు



హైదరాబాద్ పై తీవ్రవాదులు మరొకసారి తమ పంజా విసిరారు. దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో 18మంది వరకూ మరణించినట్లు సమాచారం. మరొక యాభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి , కోణార్క్ ధియేటర్ల వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే భయంతో ప్రజలు పరుగులు తీయడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.  

Wednesday, February 20, 2013

స్పెయిన్లో బన్నీతో కలిసిన ఎన్టీఆర్

                

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతుంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ సినిమా 'ఇద్దరమ్మాయిలతొ' షూటింగ్ కూడా అక్కడే జరుపుకుంటుంది. ఈ  రెండు సినిమాలూ ఒకే ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుండటంతో బాద్ షా యూనిట్ సభ్యులయిన ఎన్టీఆర్, శ్రీనువైట్ల లు ఇద్దరమ్మాయిలతొ సినిమా యూనిట్ ని కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు సినిమాలకూ బండ్ల గణేష్ నిర్మాత కావడం విశేషం.                           

Tuesday, February 19, 2013

చెట్టు క్రింద ప్లీడర్ గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ త్వరలో లాయర్ గా కనిపించనున్నాడు! ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్స్ అయిన పవన్, వెంటనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చెట్టు క్రింద లాయర్ గా వున్న పవన్...  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ప్రజల పక్షాన నిలిచి ఏ విధంగా  విజయం  సాధించాడనేదానిని దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో చూపెట్టనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత క్రిష్, సంపత్ నంది ల దర్శకత్వంలో చెయ్యడానికి అంగీకరించాడు.
  
More News:
                     దయతలిచిన దర్శకుడు లారెన్స్!

'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' దాసరి నారాయణరావు



టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' అనే టైటిల్ తో ఈయన ఒక సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. కొంతమంది కొత్త నటులతోపాటు పాత నటులు కూడా ఈ సినిమాలో నటించనున్నారట. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేస్తూ ఒక సినిమాను విడుదలచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' సినిమాలో దాసరి ఎవరిని టార్గెట్ చేస్తారు అనేదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

Monday, February 18, 2013

ఆ హీరోతో డేటింగ్ చేసానన్న శ్రద్దా దాస్!


హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమయిన వరుణ్ సందేశ్ తెరమీద కనపడేటంత అమాయకుడేమీ కాదు. చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇతని తెరవెనుక భాగోతాలు మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు ఇతని గురుంచి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే...హీరోయిన్ శ్రద్దా దాస్ తెలుసు కదా! మరో చరిత్ర సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్యా హాట్ హాట్ అఫైర్ సాగిందట. దాదాపు రెండు సంవత్సరాలపాటు సీక్రెట్ గా సాగిన వీరి అఫైర్ తరువాత బ్రేక్ అయింది. ఈ విషయాన్ని శ్రద్దా దాస్ స్వయంగా వెల్లడించింది. కానీ ఇలా విడిపోవడానికి గల కారణమేమిటన్నదాని గురుంచి మాత్రం శ్రద్ధా నోరు విప్పడంలేదు.  

విక్రమ్, రానాల మాటల యుద్ధం



టాలీవుడ్ హీరో రానా, తమిళ హీరో విక్రమ్ మీద విరుచుకుపడ్డాడు. దీనికి కారణమేమిటంటారా...? 
విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో రానా బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది. బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడమనేది కెరీర్ ను మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టడమే అవుతుంది. దీని వల్ల చాలా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది అంటూ ఉదాహరణగా రానా గురుంచి చెప్పాడు. రానాని తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు చేసాడు. అక్కడ కూడా చుక్కెదురవడంతో తిరిగి తెలుగులో చేస్తూ తడబడుతున్నాడు అని అన్నాడు.
దీనిపై రానా ఒక రేంజ్ లో విమర్శలు చెయ్యడం జరిగింది. వరుసగా పది ఫ్లాప్ సినిమాలకు దగ్గరలో వున్న నువ్వు నీ కెరీర్ పై దృష్టి పెట్టడం మంచిది. పాతికేళ్ళు కెరీర్ వున్న మీరు రెండున్నరేళ్ళ కెరీర్ తో సాగుతున్న నా గురుంచి ఆలోచించడం మాని మీ పని మీరు చూసుకోండని జవాబిచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోగానీ కోలీవుడ్ లోగానీ ఈ మాటల యుద్ధం పెద్ద చర్చాంశనీయమయింది.

Sunday, February 17, 2013

రాజమౌళి-ప్రభాస్ ల బాహుబలి మూవీ ఫస్ట్ లుక్


దర్శకధీర ఎస్ ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న బాహుబలి సినిమా ఫస్ట్ లుక్ మీకోసం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించనుంది. 

Saturday, February 16, 2013

భాజాపా లో చేరిన చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్

  
కేందమంత్రి, మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ భారతీయ జనతాపార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. చిరు చిన్న కూతురు శ్రీజ, భరద్వాజ్ లు ప్రేమించి సినిమా స్టైల్లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో విడిగా వుంటున్నారు. అయితే ఈ భరద్వాజ్ మొదట వైఎస్సార్ కాంగ్రెస్స్ లో చేరబోతున్నాడనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ ఎందుకో ఇది కార్యరూపం దాల్చకుండా భాజాపా వైపు అడుగులు వేసాడు శిరీష్. బండారు దత్తాత్రేయ, ప్రభాకర్ లాంటి ప్రముఖుల సమక్షంలో ఈయన బీజేపీలో చేరడం జరిగింది.  

Friday, February 15, 2013

మహేష్ బాబు కూతురు సితార ఫోటో



టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల రెండో సంతానమయిన సితార ఫోటో మీకోసం. పై చిత్రంలో కొడుకు గౌతమ్ ని కూడా చూడవచ్చు.

హేమచంద్ర, శ్రావణ భార్గవి పెళ్లి ఫోటోలు




వర్ధమాన సింగర్లయిన హేమచంద్ర, శ్రావణ భార్గవిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఈ జంట నిశ్చితార్ధం కూడా జరిగింది. ప్రేమికులరోజు అయిన ఫిబ్రవరి 14 న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు మీకోసం.