Friday, September 19, 2014

హీరోయిన్ ను ముంచేస్తున్న హీరో ?


ప్రస్తుతం సౌత్ లో ఆమె ఒక టాప్ హీరోయిన్! అయితే చాలా మంది అగ్ర కధానాయికలలాగే ఈమె కూడా ఒక హీరో ఉచ్చులో చిక్కుకుంది. యంగ్ గా కనిపించే నలభై ఏళ్ళ సదరు హీరో ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ప్రస్తుతం ఈమెను తగులుకున్నాడని ఇండస్ట్రీ టాక్. వీళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి కూడా చేసేసుకున్నా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారట. ఈ పెళ్లి విషయమై ఇండస్ట్రీలో అందరూ గుసగుసలాడుకుంటున్నా, వీరిద్దరూ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేసేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ దగ్గరున్న కోట్ల రూపాయల ఆస్తుల్ని ఖర్చు పెట్టించే పనిలో ఉన్నాడట సదరు హీరో. ఈమెకు కష్టార్జితాన్ని పది కోట్ల రూపాయలను ఒక సినిమాలో ఇన్వెస్ట్ చేయించాడట. ఆ సినిమా కాస్తా ఫట్ మని పేలిపోయింది. అయినా ఈ  హీరొయిన్ కి మాత్రం జ్ఞానోదయం కలగలేదని ఇండస్ట్రీ వర్గాలు జోకులు వేసుకుంటున్నాయి. 

ఎవరి ఆనందం వారిది!



Monday, September 15, 2014

'ఆగడు' లో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ ఫస్ట్ లుక్


ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాలో సౌత్ బ్యూటీ శృతి హాసన్ ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్టిల్ ని ఈ రోజు విడుదల చెయ్యడం జరిగింది. మొదటిసారిగా శృతి ఒక తెలుగు సినిమాకోసం పాట పాడి మరీ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. 'జంక్షన్ లో' అంటూ సాగే ఈ పాటని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్ లో చిత్రీకరించారు. 

Friday, September 12, 2014

తప్పు చేశానంటున్న పోర్న్ స్టార్


ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తప్పు చేశానంటూ లెంపలు వేసుకుంటుంది. విదేశాల్లో పుట్టిపెరిగిన ఈమె, తెలిసీ తెలియని వయసులో నీలి చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది. సొంత మొగుడితోనే ఆ చిత్రాల్లో నటించిన సన్నీ అలా చేసుండకూడదని ఇప్పుడు తీరిగ్గా వాపోతుంది. 
నాలుగు గదుల మధ్య చేయాల్సిన శృంగారాన్ని బహిరంగపరచడం మంచిది కాదని ఇప్పుడు తెలిసొచ్చింది. తనలో భారతీయ మూలాలు ఉండబట్టే ఈ విషయాన్ని ఇప్పుడు నిజాయితీగా ఒప్పుకున్నానని చెబుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం సినిమాల వల్ల ఇంత పేరొస్తుందని ముందే తెలిసుంటే ఆ దారిలో వెళ్లక పోయేదట సన్నీ లియోన్.