కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తాజా చిత్రం 'మిస్టర్ పెళ్ళికొడుకు' రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ మూవీ అయిన తను వెడ్స్ మను చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన 'మిస్టర్ పెళ్ళికొడుకు' యుధాతధంగా మాత్రం తెరకెక్కడం జరగలేదు. రీమేక్ సినిమాలు ఉన్నదున్నట్లుగా తెరకెక్కకపోయినా ఎవరి నేటివిటికీ తగ్గట్లుగా వారు మార్చుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడిని ప్రక్కన పెట్టి మరీ సునీల్ సొంత దర్శకత్వం చెయ్యడంతో.. ఈ సినిమా ఇలా తయారయ్యిందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్నాయి. ఇంతకుముందు కూడా పూలరంగడు సినిమాలో సునీల్ వేలుపెట్టి కెలికాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హిట్ అవడంతో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా ఫ్లాప్ కావడంతో అందరూ సునీల్ ని వేలెత్తి చూపిస్తున్నారు.
MORE NEWS:
అనుష్క శర్మ హాట్ ఫొటోస్
'జంజీర్' చిత్రం రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న రామ్ చరణ్ తేజ రీసెంట్ గా చేసిన సాహసం బాలీవుడ్ జనాలను నివ్వెరపరిచింది. ఈ మధ్యనే రామ్ చరణ్, శ్రీహరి, సంజయ్ దత్ (హిందీ) ల మీద ఒక ఫైట్ సీన్ ని షూట్ చెయ్యడం జరిగింది. ఈ రిస్కీ ఫైట్ లో భాగంగా రామ్ చరణ్ మూడంతస్తుల ఎత్తునుంచి దూకాల్సి వుండగా, ఎటువంటి వైరుల సహాయం లేకుండానే దూకేయడం చూసి యూనిట్ సభ్యులతోపాటు దర్శకుడు అపూర్వ లఖియా కూడా నివ్వెరపొయారని సమాచారం.
ఫోటో లింక్
హీరో వరుణ్ సందేశ్ చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించినా చేసే పనులు మాత్రం పెద్ద వాళ్ళని మించిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో అఫైర్ల విషయంలో వరుణ్ సందేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటం విశేషం. హీరోయిన్ శ్రద్దా దాస్ తనకూ వరుణ్ కు మధ్య కొంత కాలం అఫైర్ నడిచిందని ఈ మధ్యన చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో 'క్లాస్ అబ్బాయి మాస్ అమ్మాయి' సినిమాలో తన సరసన నటిస్తున్న హరిప్రియతో ఘాటు అఫైర్ నడిపిస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఈ అఫైర్ కారణంగా ఆమెను తనకు తెలిసిన దర్శక, నిర్మాతలకు రికమెండ్ చేస్తున్నాడట. ఇలా వీరిద్దరి మొదటి సినిమా పూర్తి కాకుండానే 'ఈ వర్షం సాక్షిగా' అనే సినిమాలో తిరిగి నటించబోతున్నారు. హరిప్రియకు ఇప్పుడీ అవకాశం రావడం వెనుక వరుణ్ సందేశ్ కృషి వుందని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.
More News:
మహేష్ బాబు పై నమ్రత ప్రేమ
హీరో డిమాండ్లకు కాళ్ళకు బుద్ది చెప్పిన నిర్మాత