Monday, October 21, 2013

దిల్ రాజు బౌన్సర్లు...


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు పరిస్థితి త్వరలో తారుమారుకానుందా... ! ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు గురుంచే అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ కి టెక్నీషియన్, కార్మికులలో పేమెంట్ ప్రాంప్ట్ గా ఉంటుందనే గుడ్ విల్ వుండేది. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.  

'రామయ్యా వస్తావయ్యా' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, కార్మికులకిచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుండటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. ప్రస్తుతం చెక్ లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ని కూడా మూసేసారనే టాక్ వినపడుతుంది. 

Friday, October 18, 2013

పవన్ డైలాగ్ పై నాగార్జున సెటైర్



నేను ట్రెండు ను ఫాలో అవను... సెట్ చేస్తా అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగుకి ఈలలు చప్పట్లూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన నాగార్జున 'భాయ్' సినిమా ట్రైలర్ లో " ఇక్కడ ఎవడుపడితే వాడు వచ్చి ట్రెండును సెట్ చేసామనే బ్రమలో వున్నారు. అసలు ట్రెండును క్రియేట్ చేసింది నువ్వే కదా భాయ్" అనే డైలాగు వుంది. 

ఇది పవన్ కళ్యాన్ డైలాగుకి కౌంటర్ గా వేసిన సెటైరే అని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ ఇది పవన్ డైలాగుకి సెటైర్ కాదు. ఏదో డైలాగు బాగుంది కదా అని సినిమాలో పెట్టడం జరిగింది అని వివరించారు. ఏది ఏమైనా భాయ్ డైలాగు మాత్రం ఫిలింనగర్లో ఆసక్తికరమైన చర్చను జరుపుతుంది. 

Wednesday, October 16, 2013

మేనేజర్ ని తొలగించిన జూనియర్ ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేసి అవకతవకలకు పాల్పడి గెంటివేయబడిన కృష్ణ అనే అతన్ని తన మేనేజర్ గా నియమించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ సదరు కృష్ణను తన మేనేజర్ గా నియమించుకున్నాడని తెలిసినప్పుడు ఫిలిం నగర్ లో చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. అయితే వారెవరి విమర్శలనూ అప్పుడు పట్టించుకోని జూనియర్ ఇప్పుడు సడన్ గా అతన్ని తొలగించాడు. దీనికి కారణం 'రామయ్యా వస్తావయ్యా'  సినిమా రిజల్ట్ అయ్యుండొచ్చని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది.