Thursday, October 31, 2013

నయనతారకు అంతుపట్టని చర్మ వ్యాధి

 
టాలీవుడ్ సెక్సీ తార నయనతార అంతుపట్టని చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి వల్ల ఒళ్ళంతా బొబ్బలు రావడంతో చాలా ఇబ్బందులు పడుతుందట నయన. దీంతో దీంతో మేకప్ వెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుండటంతో, ఇంగ్లీష్ మందులతోపాటు కేరళ వైద్యాన్ని కూడా వాడుతుంది  ఈమె. 
అయితే ఎన్ని మందులు వాడుతున్నా నాన్ వెజ్ తిన్నప్పుడల్లా మాత్రం ఈ వ్యాధి తిరగబెడుతుంది.  దీని వల్ల కొన్ని సినిమా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతుండటంతో నయన బెంగ పెట్టుకుంది. ఇంతకు ముందు సమంతా కూడా ఇటువంటి వ్యాధితో బాధపడటం విశేషం.  

Monday, October 28, 2013

పవన్ కళ్యాన్ వద్దంటే హిట్ కొట్టిన మహేష్ బాబు


పంచ్ డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాన్ ని సంప్రదించడం జరిగిందట. కానీ పవన్ తిరస్కరించడంతో మహేష్ బాబు నటించాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే రేటింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. 

అతడు సినిమా ఒక్కటే కాకుండా పూరీ జగన్నాధ్ 'ఇడియట్' సినిమా స్టోరీ కూడా పవన్ కి చెప్పడం జరిగిందట. ఈ సినిమాని కూడా పవన్ తిరస్కరించడంతో రవితేజ తో హిట్ కొట్టాడు పూరీ. ఇలా పవన్ రెండు హిట్ సినిమాలను వేరే హీరోలకు వదులుకోవడం జరిగింది.  

Monday, October 21, 2013

దిల్ రాజు బౌన్సర్లు...


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు పరిస్థితి త్వరలో తారుమారుకానుందా... ! ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు గురుంచే అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ కి టెక్నీషియన్, కార్మికులలో పేమెంట్ ప్రాంప్ట్ గా ఉంటుందనే గుడ్ విల్ వుండేది. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.  

'రామయ్యా వస్తావయ్యా' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, కార్మికులకిచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుండటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. ప్రస్తుతం చెక్ లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ని కూడా మూసేసారనే టాక్ వినపడుతుంది.