Thursday, August 28, 2014

మంచు లక్ష్మి బెల్లంకొండ మధ్య 'రభస'


బెల్లంకొండ సురేష్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రభస' సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం మంచు లక్ష్మి - సురేష్ ల మధ్య గొడవకు దారి తీసింది. విషయం ఏమిటంటే మంచు లక్ష్మి ఇంతకు ముందు నిర్మించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' సినిమా సెట్ ని రభస సినిమా కోసం ఉపయోగించుకున్నారు. దీనికిగాను 58 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. 
అయితే బెల్లంకొండ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో మంచు లక్ష్మి మనుషులు బెల్లంకొండ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వివాదం కాస్తా పోలీసుల వద్దకు చేరింది. బెల్లంకొండ మాత్రం తను గతంలో విష్ణు హీరోగా సినిమా చెయ్యడానికి అడ్వాన్సు ఇచ్చివున్నానని, దాంట్లో మినహాయించుకొవాలని చెప్పడం జరిగిందని అంటున్నాడు. 
ఈ విధంగా 'రభస' సినిమా వివాదానికి కారణమయ్యింది. 

No comments:

Post a Comment