Friday, September 19, 2014

హీరోయిన్ ను ముంచేస్తున్న హీరో ?


ప్రస్తుతం సౌత్ లో ఆమె ఒక టాప్ హీరోయిన్! అయితే చాలా మంది అగ్ర కధానాయికలలాగే ఈమె కూడా ఒక హీరో ఉచ్చులో చిక్కుకుంది. యంగ్ గా కనిపించే నలభై ఏళ్ళ సదరు హీరో ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ప్రస్తుతం ఈమెను తగులుకున్నాడని ఇండస్ట్రీ టాక్. వీళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి కూడా చేసేసుకున్నా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారట. ఈ పెళ్లి విషయమై ఇండస్ట్రీలో అందరూ గుసగుసలాడుకుంటున్నా, వీరిద్దరూ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేసేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ దగ్గరున్న కోట్ల రూపాయల ఆస్తుల్ని ఖర్చు పెట్టించే పనిలో ఉన్నాడట సదరు హీరో. ఈమెకు కష్టార్జితాన్ని పది కోట్ల రూపాయలను ఒక సినిమాలో ఇన్వెస్ట్ చేయించాడట. ఆ సినిమా కాస్తా ఫట్ మని పేలిపోయింది. అయినా ఈ  హీరొయిన్ కి మాత్రం జ్ఞానోదయం కలగలేదని ఇండస్ట్రీ వర్గాలు జోకులు వేసుకుంటున్నాయి. 

ఎవరి ఆనందం వారిది!



No comments:

Post a Comment