Saturday, December 7, 2013

అల్లు అర్జున్ 'రేసుగుర్రం' మూవీ ఫస్ట్ లుక్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న రేసుగుర్రం సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. సౌత్ బ్యూటీ శృతి హసన్ బన్నీ సరసన ఈ సినిమాలో నటిస్తుంది. లక్ష్మీ నరసింహ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత అందిస్తున్నాడు. 

హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణం


ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం (53) నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో మరణించారు. సంవత్సర కాలంగా లాంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వున్న ఫామ్ హౌజ్ లో సోమవారం ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Wednesday, December 4, 2013

ప్రభాస్ అదుర్స్..


ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' పై ఇప్పటికే అనేక అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులందరూ ఆసక్తిని పెంచుకుని ఎదురుచూస్తుండగా, దర్శకుడు రాజమౌళి ఎంత కట్టడి చేస్తున్నా ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ మాత్రం లీకవుతూనే వున్నాయి. అవి కావాలని లీక్ చేస్తున్నారా లేదా అనేది అప్రస్తుతమైనా పైన కనిపిస్తున్న స్టిల్  లో మాత్రం ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపిస్తుంది కదా..