Wednesday, February 27, 2013

సునీల్ కాన్ఫిడెన్స్?


కమెడియన్ నుంచి హీరోగా ఆరంగ్రేటం చేసిన తరువాత సునీల్ సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో అప్ కమింగ్ మూవీ అయిన 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా పబ్లిసిటీ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు సునీల్. దీనికి కారణం ఏమిటంటే... సునీల్ ఈ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. సినిమాలో విషయం వుంటే అనవసరపు పబ్లిసిటీ అవసరం లేదన్నది సునీల్ ఆలోచనగా తెలుస్తుంది. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్ సరసన ఈ సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది.  

More News: గ్రీకు వీరుడు మూవీ ట్రైలర్  

Tuesday, February 26, 2013

దర్శకురాలు నందిని రెడ్డి పై కేసు!?


సినీ ఇండస్ట్రీలో కాపీ కొట్టడం అనేది చాలా కామన్ అనే విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాల నుంచి బాలీవుడ్ కాపీ కొట్టినా, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కాపీ కొట్టినా దానిని ముద్దుగా ఇన్స్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద దర్శకులు, స్టార్లతో తీసేటప్పుడు మాత్రమే ఇటువంటి సినిమా రీమేక్ హక్కులు కొంటుంటారు. సిద్దార్ధ్, సమంతా జంటగా నటించిన 'జబర్ దస్త్' సినిమా బాలీవుడ్ హిట్ మూవీ 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాకి ఫ్రీ మేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తెలుగులో నాని హీరోగా నిర్మిద్దామనే ప్రయత్నాల్లో వుండగా నందిని రెడ్డి తెరకెక్కించేసింది. దీంతో సదరు సంస్థ నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకురాలు నందిని రెడ్డి పైనా లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. జబర్ దస్త్ సినిమా బాలీవుడ్ సినిమాకి కాపీ అని ప్రేక్షకులందరూ అంటున్నా నందిని మాత్రం ఆ సినిమాకీ, మా సినిమాకీ చాలా తేడాలున్నాయని బుకాయించే ప్రయత్నం చేస్తుంది. 'అలా మొదలైంది' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన నందిని రెండో సినిమాకే ఇలా కాపీ బాట పట్టడం విచారించదగ్గ విషయం. 

Saturday, February 23, 2013

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై వర్మ సెటైర్లు



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఏమి చేసినా సంచలనంగానే వుండేది. వర్మకి ప్రస్తుతం అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోయినా ఎంతోకొంత మిగిలేఉన్నదన్న సంగతి తెలిసిందే. మొన్న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తరువాత రాజకీయనాయకులు చేసిన ప్రకటనలపై వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. 
ఈ బాంబు పేలుళ్ళ ఘటనను ఖండిస్తున్నా అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై... ఈ అరిగిన డైలాగుని 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ వింటున్నా అని ట్వీటాడు. ప్రధాన మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చెయ్యడంపై... విచారం వ్యక్తం చెయ్యకుండా సంతోషం వ్యక్తం చేస్తారని మనం అనుకుంటామా? రాజకీయనాయకులకి కోన వెంకట్ లాంటి మంచి రైటర్స్ అవసరం ఎంతైనా వుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. 
కేంద్ర హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ పేలుళ్లపై విచారణ జరిపిస్తామని అంటే ... ఈ డైలాగు ఈ దశాబ్దానికే హైలెట్ డైలాగని సెటైర్లు వేసాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి వర్మ ఈ ఘటనను కూడా సంచలనం చెయ్యాలని చూడకుండా, సామాన్య ప్రజల ఆవేదనని తన ట్వీట్స్ ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.  

More News:

నిమిషానికి అయిదు లక్షలు తీసుకున్న అంజలి