సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కోలీవుడ్ హీరోయిన్ త్రిష పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. వరుణ్ మణియన్ అనే యువ వ్యాపారవేత్త తో త్రిష కు నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు త్రిష అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సంఘటన వెనకున్న కారణాలను త్రిష వెల్లడించింది. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్ళికి పెళ్ళికొడుకు వైపు నుంచి అనేక షరతులు రావడంతో ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నట్లు త్రిష వివరించింది. అయితే ఆ షరతులు ఎవరు విధించారు అనేది మాత్రం త్రిష చెప్పడం లేదు.
తమిళ్ హీరో ధనుష్ నటించిన రఘువరన్ B. tech సినిమా అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. అవడానికి తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా, అలా కనిపించకుండా తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. మొదట ఈ సినిమాను స్రవంతి రవి కిషోర్ తమ ఇంటి హీరో రామ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగు హక్కులు కొనడం జరిగింది. అయితే పెద్దగా హీరోయిజం లేని ఈ సినిమా చెయ్యడానికి రామ్ తటపటాయించడంతో చేసేదేమీ లేక డబ్బింగ్ తో సరిపెట్టేసారు. ఇప్పుడా సినిమా ధనుష్ కి తెలుగులో మొదటి హిట్ ని తెచ్చి పెట్టింది.
నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మరణించారు. ఈయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఒక ట్రాక్టర్ ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.