Tuesday, January 6, 2015

హిట్ సినిమాను కాదనుకున్న హీరో రామ్


తమిళ్ హీరో ధనుష్ నటించిన రఘువరన్ B. tech సినిమా అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. అవడానికి తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా, అలా కనిపించకుండా తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. మొదట ఈ సినిమాను స్రవంతి రవి కిషోర్ తమ ఇంటి  హీరో రామ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగు హక్కులు కొనడం జరిగింది. అయితే పెద్దగా హీరోయిజం లేని ఈ సినిమా చెయ్యడానికి రామ్ తటపటాయించడంతో చేసేదేమీ లేక డబ్బింగ్ తో సరిపెట్టేసారు. ఇప్పుడా సినిమా ధనుష్ కి తెలుగులో మొదటి హిట్ ని తెచ్చి పెట్టింది. 

No comments:

Post a Comment