ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తప్పు చేశానంటూ లెంపలు వేసుకుంటుంది. విదేశాల్లో పుట్టిపెరిగిన ఈమె, తెలిసీ తెలియని వయసులో నీలి చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది. సొంత మొగుడితోనే ఆ చిత్రాల్లో నటించిన సన్నీ అలా చేసుండకూడదని ఇప్పుడు తీరిగ్గా వాపోతుంది.
నాలుగు గదుల మధ్య చేయాల్సిన శృంగారాన్ని బహిరంగపరచడం మంచిది కాదని ఇప్పుడు తెలిసొచ్చింది. తనలో భారతీయ మూలాలు ఉండబట్టే ఈ విషయాన్ని ఇప్పుడు నిజాయితీగా ఒప్పుకున్నానని చెబుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం సినిమాల వల్ల ఇంత పేరొస్తుందని ముందే తెలిసుంటే ఆ దారిలో వెళ్లక పోయేదట సన్నీ లియోన్.
బెల్లంకొండ సురేష్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రభస' సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం మంచు లక్ష్మి - సురేష్ ల మధ్య గొడవకు దారి తీసింది. విషయం ఏమిటంటే మంచు లక్ష్మి ఇంతకు ముందు నిర్మించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' సినిమా సెట్ ని రభస సినిమా కోసం ఉపయోగించుకున్నారు. దీనికిగాను 58 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు.
అయితే బెల్లంకొండ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో మంచు లక్ష్మి మనుషులు బెల్లంకొండ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వివాదం కాస్తా పోలీసుల వద్దకు చేరింది. బెల్లంకొండ మాత్రం తను గతంలో విష్ణు హీరోగా సినిమా చెయ్యడానికి అడ్వాన్సు ఇచ్చివున్నానని, దాంట్లో మినహాయించుకొవాలని చెప్పడం జరిగిందని అంటున్నాడు.
ఈ విధంగా 'రభస' సినిమా వివాదానికి కారణమయ్యింది.
టాలీవుడ్ లో ఒక రేంజ్ నిర్మాతగా వెలుగొందుతున్న బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమాకి కల్లుచెదిరే రీతిలో ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో టెక్నీషియన్ కి ఇచ్చే పారితోషికం కంటే ఎక్కువే ఇచ్చి పని చేయించుకున్నాడు.
ఈ సినిమాకి ముప్పై కోట్ల రూపాయలు దాటే ఖర్చయ్యిందని వినికిడి. అయితే అల్లు అరవింద్ తనయుడు శిరీష్ మాత్రం ఈ విషయం మీద తన తండ్రిపై అసంతృప్తిగా ఉన్నాడట. ఒక టాలీవుడ్ టాప్ నిర్మాత అయి వుండి కూడా తనను 'గౌరవం' లాంటి లో బడ్జెట్ సినిమాతో లాంచ్ చెయ్యడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్.